లుక్ తో భయపెట్టేస్తున్న అనసూయ.. ఫోటో వైరల్?

Google+ Pinterest LinkedIn Tumblr +

జబర్దస్త్ యాంకర్ అయిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. తన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానుల మనసులలో స్థానం సంపాదించుకుంది.

జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఒకవైపు బుల్లితెర పై యాంకరింగ్ చేస్తూ మరోవైపు వెండితెర లో కూడా నటిస్తూ దూసుకుపోతోంది. బుల్లితెరపై తనకంటూ మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే అనసూయ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప.ఈ మూవీలో అనసూయ ద్రాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోహీరోయిన్, విలన్‌ తర్వాత అనసూయ పాత్ర కీలకం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో అనసూయ సునీల్‌కు భార్యగా కనిపిస్తుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక అనసూయ రంగమ్మత్త గా ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. పుష్ప సినిమాలు అనసూయ గెటప్ చూస్తే ఈ సినిమా ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది అనిపిస్తోంది.

Share.