బన్నీకి సర్ ప్రైజ్ ఇచ్చిన రష్మిక మందన?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17 న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా బన్నీ కి సర్ ప్రైజ్ ను ఇచ్చింది రష్మిక మందన.

సినిమా త్వరలో విడుదల కాబోతుంది కదా సార్.. స్పెషల్ గా ఏదైనా పంపించాలి అనిపించింది, అందుకే ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ మీకోసం అంటూ చేతితో రాసి నోటు తో పాటు కొన్ని వస్తువులను బాక్సులో పెట్టి పంపించింది. అదే విషయాన్ని అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ థాంక్యూ అని తెలిపాడు. రష్మిక పంపించిన గిఫ్ట్ లో వస్తువులను చూస్తుంటే అది పుష్ప షూటింగ్ సమయంలో ఉపయోగించిన వస్తువులు గా కనిపిస్తున్నాయి.

Share.