మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక తన సేవా గుణం తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఒకవైపు మెగాస్టార్ కోడలి గా తన బాధ్యతలను మరవకుండా మరొక పక్క అపోలో వైస్ చైర్మన్గా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుంది ఉపాసన. ఇక రామ్ చరణ్ బిజినెస్లను కూడా ఉపాసన మెయింటైన్ చేస్తోంది.
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన ట్రాన్స్జెండర్స్ తో దిగిన ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి. తన సోదరి వివాహ వేడుకల్లో భాగంగా ట్రాన్స్జెండర్ తో ఉపాసన కాసేపు టైం స్పెండ్ చేసింది. అందులో ఆమె బెస్ట్ ఫ్రెండ్ కూడా ఓ ట్రాంజెండర్ అన్న సంగతి మనకు తెలిసిందే. తనకు ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసింది ఉపాసన. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలి అనేది మీరు నాకు నేర్పిస్తూ నే ఉన్నారు అని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఉపాసన అంత మంచి మనసు ఎవరికి ఉండదని చెప్పవచ్చు.