శైలజా రెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ బిజినెస్.. చైతూ కెరీర్‌లోనే తోపు!

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. చందూ ముండేటి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’ చిత్రంతో పాటు మారుతి డైరెక్షన్‌లో ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే సినిమా కూడా చేస్తున్నాడు చైతూ. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేస్తూ రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా మార్కెట్ లేని నాగ చైతన్య, శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో తన మార్కెట్ స్థాయిని పెంచుకోవాలని చూస్తున్నాడు.

తాజాగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తే ఎవ్వరికైనా ఆశ్యర్యం కలగక మానదు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న శైలజా రెడ్డి అల్లుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.25 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రా ప్రాంతంలో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ రూ.9 కోట్లకు అమ్ముడుపోగా సీడెడ్‌లో రూ.3.5 కోట్లు, నైజాంలో రూ.6.5 కోట్లకు డీల్ కుదిరింది. రెస్టాఫ్ ఇండియాతోపాటు ఓవర్సీస్ హక్కులు కూడా కలుపుకుని ఈ చిత్రం మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.25 కోట్లకు చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇది చైతూ కెరీర్‌లోనే హయ్యెస్ట్ అని చెప్పాలి. అతడి కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘‘రారండోయ్ వేడుక చూద్దాం’’ చిత్ర కలెక్షన్లను అధిగమిస్తేనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుంది. మరి ఈ మార్కును శైలజా రెడ్డి అందుకుంటాడా లేడా అనేది చూడాలి.

Share.