స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాకి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ హీరో బన్నీ, శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాదు సునీల్, ఫహద్ ఫాజిల్ ,అనసూయ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పుడే కేవలం 20 నిమిషాల ముందు పుష్ప మరో డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ డిసెంబర్ ఆరో తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పుడు సింగిల్ పార్ట్ విడుదల చేశారు.విడుదల. ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ చాలా పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నాడు . ఈ పార్ట్ మొత్తానికి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేలా కనిపిస్తోంది. ఇక పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.