సినీ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న అతి కొంత మంది హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. తన సినిమాలలో రొమాంటిక్ పండించడమే కాదు కామెడీని కూడా చాలా బాగా చేయగలడు. రాజ్ తరుణ్ ఇటీవల నటించిన చిత్రం అనుభవించు రాజా.. ఈ సినిమా ప్రస్తుతం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు ముందే ఫ్లాప్ అవుతుందని ఒక హీరో చెప్పాడట.. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ హీరో ఎవరో కాదు మాస్ మహారాజ రవితేజ. రవితేజ దగ్గరకు దర్శకుడు శ్రీను ఈ కథను తీసుకొని వెళ్లినప్పుడు కథ విని కొన్ని రోజులు బాగా ఆలోచించి మరీ రిజెక్ట్ చేశాడట.అందుకు గల కారణం కథలో ఆయన అనుకున్నంత డిఫరెంట్ గా ఏమీ లేకపోవడంతో ప్రేక్షకులకు నచ్చదని భావించిన రవితేజ..ఈ సినిమాను రిజెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని, ఖిలాడి సినిమాతో మరో సరికొత్త యాంగిల్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు రవితేజ.. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా 16 కోట్ల రూపాయలను పారితోషికం అందుకుంటున్నారు అని సమాచారం.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.