అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా రెండు విభాగాలుగా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో మొదటి భాగం డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదలకు సిద్ధంగా ఉన్నది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఎన్నో పోస్టర్లు , వీడియోలు చిత్ర బృందం విడుదల చేసింది. ఇక వాటికి మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం. ఇక వీటితో పాటుగా కొన్ని లిక్ అయిన ఫోటోలు కూడా బాగా క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను చిత్రబృందం డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ట్రైలర్ కట్ పనుల్లో బిజీగా ఉన్నట్లుగా పలు ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగింది.
ఇక ఈ సినిమాలో ఫాహద్ ఫజిల్, అనసూయ, సునీల్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
TRAILER CUT… #ThaggedheLe 🔥😎
Stay hyped… #PushpaTrailer 🤙#PushpaTheRise #PushpaTheRiseOnDec17 pic.twitter.com/8AsTrFaY7Y
— Pushpa (@PushpaMovie) December 2, 2021