ఒక్క మాటలో అఖండ మూవీ గురించి చెప్పిన ఎన్టీఆర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. డైరెక్టర్ బోయపాటి శ్రీను అభిమానులను దృష్టిలో పెట్టుకుని మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇక ఈ మూవీలో బాలకృష్ణ నటన చూసిన ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక దీంతో భారీగానే ఓపెనింగ్స్ రాబట్టిన అన్నట్లుగా సమాచారం.

అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ సినిమాపై ఒక్కమాటలో ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే అఖండ సినిమా ను చూశానంటూ..బాలా బాబాయ్ కి అలాగే మొత్తం చిత్ర యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ తెలిపారు. ఇది రీసౌండ్ ఇన్ సక్సెస్ అంటూ పేర్కొన్న జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో ఫ్యాన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సినిమాలో అని తెలియజేశారు. ఎన్టీఆర్ తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ చేయడం ద్వారా అది వైరల్ గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సారి కూడా బాబాయ్ సినిమాను ప్రత్యేకంగా వీక్షిస్తూ వస్తున్నాడు.

Share.