అఖండ టీమ్ కు అభినందనలు తెలిపిన మహేష్ బాబు?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ. ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయినా థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. బాలయ్య అభిమానులు ఈలలు, కేకలు, టపాసులు పేలుస్తూ థియేటర్ల వద్ద సందడి సందడి చేస్తున్నారు. మంచి ఓపెనింగ్స్ తో అదిరిపోయే టాక్ తో ఖాతా తెరిచిన అఖండ రికార్డుల దిశగా ముందుకు దూసుకెళ్లడం ఖాయం అనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా పై సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు.

అఖండ సినిమా చూసిన అనంతరం మహేష్ బాబు ట్వీట్ చేస్తూ’ అఖండ భారీ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిందని వినడానికి చాలా సంతోషంగా ఉంది.

నందమూరి బాలకృష్ణ బోయపాటి తో పాటు అఖండ టీమ్ కు అభినందనలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. బాలయ్య సినిమా పై మహేష్ బాబు ట్వీట్ చేయడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించి యాక్టింగ్ ను అదరగొట్టాడని ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తోంది.

Share.