కొత్త సినిమా చిత్రీకరణలో జాయిన్ అయిన చిరంజీవి?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు మెగాస్టార్. ఆచార్య,బోళా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న చిరంజీవి తాజాగా ఒక కొత్త సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. ఆ సినిమాకు బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యేర్రేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాదులో ప్రారంభం అయింది.

ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో చిరంజీవికి సీన్ వివరిస్తున్న ఒక ఫోటోను బాబి షేర్ చేస్తూ చిరంజీవి అన్నయ్య తొలి రోజు షూటింగ్ లో మాతో జాయిన్ అయ్యారు. కొంచెం నెర్వస్ గా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రయాణానికి గొప్ప ఆరంభం ఇది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సహ నిర్మాతగా జీకే మోహన్, సీఈఓ గా చెర్రీ వ్యవహరిస్తున్నారు.

Share.