వామ్మో..ఆ హీరో సినిమా కోసం ప్రీ బుకింగ్సే అన్ని కోట్లా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదల అవుతుంది అంటే కొన్ని కొన్ని సార్లు ప్రీ బుకింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రీ బుకింగ్ జరిగేటప్పుడు మహా అయితే కేవలం వేలల్లో మాత్రమే బుకింగ్స్ ఉంటాయి.. కానీ ఇక్కడ ఒక స్టార్ హీరో సినిమా కోసం ప్రీ బుకింగ్ టికెట్ ల కే ఏకంగా వంద కోట్లు వసూలు చేశారు. అంటే ఇక ఆ సినిమా విడుదలయ్యాక ఎన్ని కోట్ల బడ్జెట్టు రాబడుతుందో ఊహించడం కష్టమే అని చెప్పవచ్చు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు మలయాళం మెగా స్టార్ హీరో మోహన్ లాల్.

మోహన్ లాల్, ప్రియదర్శన్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా మరక్కార్ ఆర్.. ఈ సినిమా హాలీవుడ్ లెవల్లో రూపొందించడం గమనార్హం. ఈ సినిమా.. ఒకేసారి మలయాళం కన్నడ, హిందీ వంటి భాషలలో ఈ రోజున విడుదలవుతుంది. తెలుగులో మాత్రం రేపు విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు విడుదల అయినప్పటికీ.. సరికొత్త రికార్డును అయితే నెలకొల్పినట్లు సమాచారం. అది ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్..100 కోట్లకు పైగానే కలెక్షన్ల మార్పును అందుకున్నట్లు.. చిత్ర యూనిట్ సభ్యులు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు.

ఇక ఈ మూవీ దాదాపుగా 5,000 థియేటర్లో పైగా విడుదల కాబోతోంది. అంటే దాదాపుగా రోజుకి పదహారు వేల షోలు థియేటర్లో పడనున్నాయి. అయితే ఈ సినిమా ఎంత కలెక్షన్ సాధిస్తుందో చూద్దాం.

Share.