టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగులో భాగంగా ఆయన కాలికి చిన్న గాయం అవడంతో గాయం కారణంగా కొన్నాళ్ళకు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో అతడి మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకోవాలని మహేష్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఒకవేళ సర్జరీ కనుక జరిగితే అతడు రెండు మూడు నెలల పాటు షూటింగ్కు దూరం కావాల్సి వస్తుంది. ఇక సోషల్ మీడియాలో మహేష్ బాబు సర్జరీ చేయించుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
I wish u to have Speed Recovery Annayya 🥺#GetWellSoonMaheshBabu#SarkaruVaariPaata pic.twitter.com/4hHZTuA2ps
— Maheshwar Thota 🔔 (@ThotaMaheshwar) December 1, 2021
ఈ సర్జరీ కోసం మహేష్ బాబు అమెరికా వెళ్లారు ఉన్నారట. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకు బ్రేక్ పడనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్విట్టర్లో #GETWELLSOONMAHESHBABU అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.తమ అభిమాన హీరో మహేశ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు.