నాగబాబు రీ ఎంట్రీ.. ఈసారైనా ఉంటాడా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా బ్రదర్ నాగబాబు ఒకప్పుడు జబర్దస్త్ షో నుంచి జడ్జ్ గా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ జబర్దస్త్ షో కి దూరం కావడంతో మల్లెమాల యూనిట్ తో గొడవ పడ్డారు అనే వార్తలు వినిపించాయి.. కానీ ఈ విషయంపై స్పష్టత రాలేదు. ఇక తర్వాత జీ తెలుగులో 2 కామెడీ షో లకు జడ్జిగా కూడా వ్యవహరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్లీ ఇప్పుడు మా టీవీ లోకి వచ్చేసారు.

కామెడీ రియాల్టీ షో కాన్సెప్ట్ తో మాటీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో కి నాగబాబు జడ్జీ గా వచ్చారు. కొన్ని రోజుల క్రితం ఈ షో కి శేఖర్ మాస్టర్ జడ్జి గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత మూడు రోజులనుంచి ఆయన కనిపించకపోవడంతో ఆ స్థానంలో ఆలీ వచ్చారు . ఇక ఇప్పుడు ఫుల్ టైం జడ్జ్ గా నాగబాబు వచ్చారు. ఆయన ఎంట్రీ తో శ్రీముఖి డైలాగులలో ఈ విషయం తేలిపోయింది. అయితే ఎందుకు ఇన్ని రోజులు రాలేదు అనే విషయం మాత్రం ఎవరు చెప్పలేదు. అందరి మనసులలో ఉన్న ప్రశ్న ఏమిటంటే .. ఈ షో అయినా ఎక్కువ కాలం కొనసాగుతుందా..? అని, ఈ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Share.