బాలయ్య కెరిర్ లోబ్లాక్ బాస్టర్ మూవీ.. థియేటర్ల వద్ద జాతర వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతున్నారు. ఆయన చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పటికీ.. ఆహా ఓటీటీ లో unstoppable అంటూ దూసుకొచ్చారు బాలకృష్ణ. అయితే తాజాగా అఖండ మూవీ తో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలకృష్ణ. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.

అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ సినిమా అని చెప్పవచ్చు. ఇక ఈ మూవీపై బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ రోజున ఈ సినిమా విడుదలై మంచి హిట్ సక్సెస్ను అందుకుంది. బెనిఫిట్ షో లతోపాటు, యూఎస్ షో లు కూడా విడుదలయ్యాయి. దీంతో ఫాన్స్ పూనకాలతో థియేటర్లు ఊగిపోతున్నారు.

దీంతో థియేటర్ల వద్ద బాలకృష్ణ అభిమానులు ఒక మాస్ సినిమా బోయపాటి శ్రీను అందించినట్టు ఈ రెస్పాన్స్ చూస్తే తెలుస్తోంది. థియేటర్ల వద్ద బాణాసంచాలు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా అఖండ చూసిన సినిమా జనం మాస్ జాతర “నెక్స్ట్ లెవెల్ ” అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి బాలకృష్ణ మంచి హిట్ ను కొట్టాడని చెప్పుకోవచ్చు.

Share.