సిరివెన్నెలతో త్వరలో నేనూ వస్తా.. అక్కడ కలుద్దాం అంటున్న ఆర్జీవీ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ గేయ రచయిత గా గుర్తింపు పొందిన సిరివెన్నెల సీతారామశాస్త్రి లంగ్ క్యాన్సర్ రావడంతో ఆయన నవంబర్ 30వ తేదీన తుది శ్వాస విడిచారు. అయితే నిన్న దహనసంస్కారాలు పూర్తి కాగా సినీ ఇండస్ట్రీలో ఉన్న పలువురు సెలబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు ఆర్జివి కూడా స్వర్గంలో కలుస్తాము త్వరలోనే నేను వస్తాను అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది..

సిరివెన్నెల కు.. తనకు చాలా అనుబంధం ఉంది అని ఆయన తెలిపాడు. మొదటిసారి శివ సినిమా కోసం సిరివెన్నెల ను కలిశానని తెలిపాడు ఆర్జీవి. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోతారు. కానీ ముందు తరాలకు ఒక మార్గదర్శకునిగా రచయితలకు ఒక గురువుగా ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు అని ఆర్జీవీ అన్నారు.మీరు ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్స్‌ రాసారు కాబట్టి కచ్చితంగా స్వర్గానికి వెళ్లుంటారు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలకు నా హాయ్ చెప్పండి. కానీ నేను ఎక్కవ పాపాలు చేసి నరకానికి వెళ్తాను. పొరపాటున స్వర్గానికి వస్తే మాత్రం మీరెలాగో నాతో వోడ్కా తాగరు కాబట్టి.. మన ఇద్దరం కలిసి అమృతం ఓ పెగ్గేద్దాం అని ఆడియో క్లిప్‌ ని ట్వీట్‌ చేశాడు ఆర్జీవీ.

Share.