ఎన్టీఆర్ తన విశాల హృదయంతో వరద బాధితులకు సహాయం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు వారాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో వరదలు కూడా సంభవించాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, రాయలసీమ జిల్లాలోని ఈ పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి ప్రజలు అనేక కష్టాలకు గురి అవుతున్నారు. అయితే తాజాగా ఈ వరద బాధితులను ఆదుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ తన ఆర్థిక సహాయంగా వరద బాధితుల కోసం 25 లక్షల రూపాయలను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు ఇవ్వడం జరిగింది.

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఏపీ వరద బాధితులకు.. ఆర్థిక సహాయం ఇచ్చిన నటుడిగా ఎన్టీఆర్ కు ఆ ఘనత దక్కింది.ఇక ఏపీ ప్రభుత్వం కూడా వరద బాధితులను ఆదుకునేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు నిర్మించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే భారీ వర్షాల కారణంగా మరణించిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ తరఫున వరదబాధితులకు లక్ష రూపాయలు చొప్పున ఇచ్చినట్లు తెలుస్తోంది.

Share.