వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంత..3 ప్రాజెక్టులకు డీల్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ బ్యూటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరవాత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతూ తగ్గేదేలా అంటోంది.ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కి సమంత స్టెప్పులు ఇరగదీసిందని సమాచారం.ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌కు పరిచయమైన సమంత ప్రస్తుతం హాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.

ఇటీవలె బాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర‍్మాణ సంస్థ యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ వారు సమంతతో చర‍్చలు జరపుతున్నట్లు తెలుస్తోంది.ఆ నిర్మాణ సంస్థ వారు ఈ క్రమంలోనే సమంత ఒకేసారి మూడు సినిమాలకు ఒప్పందం చేసుకునేందుకు సామ్‌కు ప్రపోజల్‌ పెట్టారట.దీనికోసం సమంతకు భారీగా రెమ్యునరేషన్‌ ముట్టజెప్పడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ ఒప్పందానికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున‍్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరుకు ఆగాల్సిందే.

Share.