ఆలీ షో నుండి కోపంగా బయటికి వెళ్ళిన బ్రహ్మానందం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఎంతోమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ.. హాస్యనటుడు బ్రహ్మానందానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలలో హీరోగా కూడా చేశాడు బ్రహ్మానందం. అలా తెలుగు ప్రేక్షకులను ఇంకా ఇప్పటికి అలరిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.

ఇక తన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను కూడా తెలియజేయడం జరిగింది బ్రహ్మానందం.అంతే కాకుండా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలీ, బ్రహ్మానందం మధ్య మంచి స్నేహ బంధం ఉండడంతో వీరిద్దరి మధ్య సంభాషణలు కూడా ప్రేక్షకులను బాగా కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఇటీవల ఒక వీడియో విడుదలయినప్పటికీ..తాజాగా బ్రహ్మానందము సంబంధించి రెండవ ఎపిసోడ్ పార్ట్-2 విడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. ఇందులో ఆలీ అడిగిన ప్రశ్నలకు బ్రహ్మానందం తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. అయితే చివర్లో మాత్రం అనాలి”గత కొంతకాలం నుంచి ఎందుకు సినిమాలకు దూరంగా ఉంటున్నారు అని ప్రశ్నించగా”.. ఇక బ్రహ్మానందం తన కళ్ళజోడు నేలకేసి కొట్టి.. చివరికి షో నుంచి వెళ్ళిపోయారు బ్రహ్మానందం. ఉరికిన దీంతో ఆలీ ఒక్కసారిగా షాకయ్యారు.ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Share.