తిరుపతికి వెళ్లాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 తిరుపతికి వెళ్లారా అనుకునేవారికి ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. తిరుమల రెండవ కనుమదారిలో ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడడంతో కొండపై నుంచి వచ్చే రహదారుల మధ్య బండరాళ్లు పడడంతో కొండపైకి వెళ్లే దారులు మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసం అయింది.ఆ రహదారి గుండా వస్తున్న RTC బస్సుకు క్షణంలోనే పెను ప్రమాదం తప్పింది అని చెప్పవచ్చు.ఆ వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించి.. ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో వెళ్లే టువంటి వాహనాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక లింకు రోడ్డు నుంచి విడుదల వారీగా కొండమీదకు వాహనాలను పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొండ పై నుంచి కిందికి వచ్చే వాహనాలు ఎలాంటి ఇబ్బందులు లేవు అని టీటిడి సంస్థ వారు తెలియజేస్తున్నారు. అయితే ఈ రహదారి పై పడిన రాళ్లను సిబ్బంది తొలగించడం మొదలు పెట్టింది. ఇక దీంతో రాకపోకలకు అనుమతించే అవకాశం కనిపించలేదు. తిరుపతి లో భారీ వర్షం కురిసిన కారణంగా ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. అందుచేతనే ప్రయాణించే వారు కాస్త ఆలోచించుకొని ప్రయత్నించండి.

Share.