సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ ప్రముఖులు శోకసంద్రంలో మునిగిపోయారు. సిరివెన్నెల మృతిపట్ల పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా సిరివెన్నెల మరణంపై దర్శకుడు వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
తాను చదువుకున్న అనంతమైన సాహిత్యపు సారాన్ని మరియూ జీవితం పట్ల తనకున్న అపారమైన అవగాహనని మేళవించి..రాసే ప్రతిపదం వెనుక ఎంతో గాఢమైన, లోతైన సారాన్ని, జ్ఞానాన్ని నింపుతూ.. ప్రతి పాటని ఒక తపస్సులా, తన సొంత బిడ్డలా భావిస్తూ.. పండితులను పామరులను ఏకకాలంలో ఆకట్టుకుని కట్టిపడేసే ఒక సాహిత్యపు నిత్యాన్వేషి, నిరంతర పరిశోధకుడు అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి’గారు అకాల మరణం చెందటం..తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టం అని వై.వి.యస్.చౌదరి ఎమోషనల్ అయ్యారు.ఆయనతో, ఆయన పాటలతో మరియు ఆయన కుటుంబ సభ్యులతో ఆత్మీయ పరిచయం కలగటం నేను చేసుకున్న అదృష్టం అని అంటూ వైవిఎస్.ఎమోషనల్ అయ్యారు.