పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా తాజాగా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమా నుంచి మరొక ఆసక్తికరమైన సింగిల్ ను విడుదల చేస్తామన్నారు ఇటీవలే చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఆ సాంగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అడవి తల్లి మాట అనే పేరుతో రూపొందించిన ఈ పాట నేడు అనగా డిసెంబర్ 1 ఉదయం10:08 విడుదల చేస్తామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.
కానీ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో విషాదఛాయలు అలముకోవడంతో ఈ పాట విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ పాటకు ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. భీమ్లా నాయక్ మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ కి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. రానా డేనియల్ శేఖర్గా కనిపించబోతున్నాడు.