స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిన సారా అలీ ఖాన్?

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా సినీ సెలబ్రిటీలు, వారి అభిమాన హీరో, హీరోయిన్ లు బయట కనిపించాలంటే ఫోటోగ్రాఫర్లు వారి మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు వారి సహనాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. కొంతమంది అయితే అభిమానులు చేసే ఆగడాలు తట్టుకోలేక అరవడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. అసలేం జరిగిందంటే..

సారా అలీ ఖాన్‌ తాజాగా ఆత్రంగి రే సినిమా లోని చక్‌ చక్‌ పాటను లాంచ్‌ చేయడానికి ముంబైలోని మిథిబాయి కాలేజ్‌ ఫెస్ట్ క్షితిజ్‌ కు హాజరయింది. వేడుక అనంతరం అక్కడినుంచి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో ఒక ఫొటోగ్రాఫర్‌ను నెట్టివేసినట్టున్నారు. అది చూసిన సారా, కారు ఆపి,ఎవరిని కిందకు తోసారు అని సెక్యురిటీ గార్డ్స్‌ను ప్రశ్నించింది. దానికి వారు ఎవరూ కింద పడలేదు అని సమాధానం ఇచ్చారు.

 

దానికి లేదు లేదు,మీరు నెట్టేసిన అతను అ‍ప్పటికే వెళ్లిపోయాడు.అని సెక్యూరిటీ గార్డ్స్‌ని తిరిగి నిలదీసింది. అనంతరం కారు ఎక్కుతూ ఫొటోగ్రాఫర్స్‌తో సారీ చెప్తున్నా, థ్యాంక్యూ.అని చెప్పింది. అలాగే సెక్యూరిటీ గార్డ్స్‌తో ఇలా ప్రవర్తించవద్దు. ఎవరినీ నెట్టవద్దు.అని స్వీట్‌గా వార్నింగ్‌ ఇచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Share.