టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తాజాగా కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి వెన్నెల సీతారామశాస్త్రి. అయితే అతను కోరుకునే త్వరగా ఇంటికి రావాలి అన్న ఆశలు అడియాశలు అయ్యాయి.
న్యూమోనియా తో నవంబర్ 24న సికింద్రాబాదులో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అతడి పరిస్థితి విషమించడంతో ఐసియు లో చికిత్సను అందించారు. అయితే సీతారామశాస్త్రి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ ను వెల్లడిస్తున్న వైద్యులు కాసేపటి క్రితమే అతడి పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచినట్టు తెలిపారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం తో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.సిరివెన్నెల సీతారామ శాస్త్రి 1984లో జననీ జన్మభూమితో గేయ రచయితగా అరంగేట్రం చేశారు. అలా మొదలైన సీతారాశాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు రాసారు.