యాంకర్ శ్యామల గృహప్రవేశం..ఫొటోస్ వైరల్?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్‌ యాంకర్‌ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీ షోలతో పాటు పలు ఆడియో ఫంక్షనకు తనదైన శైలిలో యాంకరింగ్‌ చేస్తు తన కంటు ప్రత్యేకతను సంపాదించుకుంది.ఈమె సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది.

ఈమె బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా ఉంటే తాజాగా యాంకర్‌ శ్యామల కొత్త ఇంట్లోకి మారింది.

ఇందుకు సంబంధించిన గృహప్రవేశం వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేసింది.పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నూతన ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ దంపతులకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు అలీ, యాంకర్ సుమ, భర్త రాజీవ్‌ కనకాల,మరియు తనీష్‌, సింగర్‌ గీతా మాధురి సహా పలువురు పాల్గొన్నారు.

శ్యామల కొత్త ఇల్లు ఇంద్రభవనంలా ఉండగా సోషల్ మీడియాలో దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది.

Share.