బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో అఖండ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. సినిమాలు ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల సత్య నారాయణరెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ పూర్ణ కూడా ఒక పాత్రలో నటించింది. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ.. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.ఇందులో నేను పద్మావతి అనే పాత్రలో చేశాను అని పూర్ణ తెలిపింది. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర నాది.
అలాగే నా లక్కీ నెంబర్ 5. 2021 ని కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాది సినిమాలలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి.అయితే సినిమాల్లో కేవలం హీరోయిన్ గా మాత్రమే చేయాలని ఫిక్స్ అవ్వలేదు. శోభన, రేవతి, సుహాసిని గార్లలాగా ఎలాంటి పాత్రలైనా చేయాలనుకుంటున్నాను అని తెలిపింది. అలాగే దృశ్యం 2 లో లాయర్ గా నటనకు పలువురు అభినందించారు అని తెలిపింది. కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లు అవుతోంది. సింగిల్ గా ఇండస్ట్రీకి వచ్చాను. ఇంతదాకా ప్రయాణించాను. డబ్బులు కావాలంటే ఎన్ని సినిమాలు అయినా చేయొచ్చు కానీ కెరిర్ చాలా కాలం కొనసాగాలంటే మంచి చిత్రాలు ఎంచుకోవాలి అని చెప్పుకొచ్చింది.