మరొకసారి పెళ్లిని వాయిదా వేసుకున్న బాలీవుడ్ జంట?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్‌ ప్రేమ జంట ఆలియా భట్‌,రణ్‌బీర్‌ కపూర్‌ లగురించి అందరికీ తెలిసిందే వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి.వీరి ఎప్పుడెప్పుడు ఒకటవుతారా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ వీరిపెళ్లి గత ఏడాదే జరగవలసి ఉండగా కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ చివర్లో వీరి పెళ్లి జరగాల్సి వుంది.కాని కొన్ని కారణాలవల్ల వీరి వివాహాన్ని మరొకసారి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.

వీరిద్దరూ పూర్తి చేయాల్సిన సినిమాలు ఇంకా పెండింగ్‌లో ఉండటం,ఇతర కారణాల వల్ల వీరు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.వారు కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నారట. పెళ్లి అయిన వెంటనే ఈ జంట ఖరీదైన ప్లాట్‌లోకి మారాలనుకుంటున్నారట. దీనికి సంబంధించి కూడా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయట. దీంతో అన్ని పనులు అనుకున్నట్లు పూర్తి అయ్యాక వచ్చే ఏడాది ఏప్రిల్‌-మే నెలలో లేదా 2022 డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

Share.