ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు వరుసగా క్యూ కడుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం సర్కార్ వారి పాట అనే విషయం తెలిసిందే. ఈ సినిమా 2022ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నా సంక్రాంతి బరిలో ఎక్కువ సినిమాలు ఉండటం కారణంగా ఈ సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేశారు.
ఇప్పుడు మహేష్ బాబు సినిమా కు పోటీగా విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా లైగర్ సినిమా పోటీకి దిగనుంది. ఏప్రిల్ 1వ తేదీన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపధ్యం లోనే మహేష్ బాబుతో పోటీ పడడానికి సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ.. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారు.. ఎవరు సక్సెస్ సాధిస్తారు.. తెలియాలంటే ఏప్రిల్ 1 2022 వరకు వేచి చూడక తప్పదు.