ప్రస్తుతం టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్.. పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆలిండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది అంటూ ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ ప్రమోషన్స్ లో బిజీ కానున్నాడు. ఆలిండియా లెవల్లో ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను హిందీలో ప్రమోట్ చేయడానికి బరిలోకి ఏకంగా అల్లు అర్జున్ దిగుతున్నారట.
ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 15 సీజన్లో కి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమా ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్ హిందీ బిగ్ బాస్ షో లోకి అడుగుపెట్టబోతున్నాడు అట. ఈ విధంగా సుకుమార్ స్కెచ్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.