రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో అలాగే విదేశాలలో కూడా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతూ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్ రాజకీయాలలో కూడా అంతే స్థాయిలో సక్సెస్ పొందాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరికు జరిగిన అన్యాయానికి విరుద్ధంగా ఎన్టీఆర్ మాట్లాడలేదని కోపంతో టిడిపి నేతలు జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కామెంట్లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కామెంట్ల వల్ల ఎన్టీయార్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గమైన కుప్పంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోవడం గమనార్హం.
కుప్పం టౌన్ మొదట సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు అంతా ఒక చోట చేరి సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడంతో పాటు బాణాసంచా కాల్చడం అలాగే ఎన్టీఆర్ జెండాలు పట్టుకొని డాన్సులు కూడా వేశారు. ఇకపోతే ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.