బిగ్ బాస్ షోకి రానున్న అల్లు అర్జున్.. ఎప్పుడో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవగానే ప్రమోషన్స్ తో బిజీ అవ్వనున్నాడు. పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అయితే పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఇక టాలీవుడ్ లో ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు ఏకంగా బన్ని నే రంగంలోకి దిగుతున్నారట.

ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ పోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 15 సీజన్ లో బన్నీ స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టబోతున్నాడట. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా లోని సిటీమార్ సాంగ్ ను సల్మాన్ ఖాన్ రాధే మూవీ లో వాడారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఒక మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడని, ఇందులో షాహిద్ కపూర్ కూడా నటిస్తున్నారు అంటూ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share.