బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకూ విజేతలకు 50 లక్షలు ప్రైజ్ మనీ మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం దీనికి అదనంగా ఇల్లు కట్టుకోవడానికి భూములు కూడా కానుకగా అందిస్తున్నారు. ఈ విషయాన్ని నాగ్ అధికారికంగా ప్రకటించారు. షాద్ నగర్ లోని కుటిర్ 25 లక్షలు విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ప్రైజ్ మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలని హౌస్ మేట్స్ ను ఆదేశించాడు నాగార్జున.
మొదటిగా ప్రియాంక మాట్లాడుతూ నేను యాభై లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉంది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అన్నారు కాబట్టి ఈ ప్రైజ్ మనీ గెలిస్తే ఒక అమ్మాయి దత్తత తీసుకున్న అని చెప్పుకొచ్చింది. అనంతరం యాంకర్ రవి మాట్లాడుతూ కొంత డబ్బు వియా చదువు కోసం పొదుపు చేస్తా, మరికొంత డబ్బు నిర్మాణ సంస్థ నెలకొల్పాలన్న కోరికను నెరవేర్చుకున్న అని తెలిపాడు రవి.