చిన్నారిని దత్తత తీసుకున్న బండ్ల గణేష్ పై ప్రశంసల వర్షం?

Google+ Pinterest LinkedIn Tumblr +

బండ్ల గణేష్ నటుడిగా, నిర్మాతగా, కమెడీయన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునన్నాడు. ఇటీవలే బండ్ల గణేష్ హీరోగా కూడా మారాడు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు ఎంత వీరాభిమానం అందరికీ తెలిసిందే. ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే బండ్ల గణేష్ కు సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక బండ్ల గణేష్ మంచితనం గురించి చెప్పాలి అంటే కరోనా సమయంలో అతడు చేసిన విషయాల గురించి తెలుసుకోవాల్సిందే.

కరోనా అలాంటి విపత్కర పరిస్థితులలో నోరు తెరిచి సహాయం అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేసి మంచి మనసును చాటుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ ఒక చిన్నారిని దత్తత తీసుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల బండ్లగణేష్ ఒక ఇంటర్వ్యూ హాజరయ్యాడు.

ఈ క్రమంలోనే తాను ఒక నేపాలి పాపని పెంచుకున్నట్లు తెలిపారు. అందరూ కుక్కలు, పిల్లులు తీసుకొని వాటి కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతుంటారని, తాను మాత్రమే ఈ పాపని పెంచుకొని గొప్పగా చదివించాలి అనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ పాప మా ఇంట్లో ఒక మెంబర్ అయిపోయిందని, అంతేకాకుండా అందరినీ బెదిరించి స్థాయికి వచ్చిందని ఫన్నీగా తెలిపాడు.బండ్ల గణేష్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Share.