ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న..బైకాప్ ఆంటీమ్?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ నటించిన తాజా చిత్రం ఆంటీమ్: ది ఫైనల్ ట్రూత్. ఈ సినిమాకు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 26న థియేటర్ లో విడుదల అయింది. పవర్ సినిమా తరువాత దర్శకుడు మహేష్ మంజ్రేకర్ తీసిన రెండో సినిమా ఇది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమా భారీగా అంచనాలు పెరిగినప్పటికీ, విడుదల తరువాత విమర్శకులు,ప్రేక్షకుల నుంచి బ్యాడ్ టాక్ ను అందుకుంటుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై #బైకాట్ ఆంటీమ్ అని ట్రెండ్ కూడా అవుతోంది. ఈ సినిమాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. సల్మాన్ఖాన్ అభిమానులు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తుంటే, కొందరు బహిష్కరిస్తున్నారు.

నిమిష నిమిషానికి ట్వీట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు గల కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అని వినిపిస్తోంది. సుశాంత్ మరణం కేసులో సల్మాన్ ఖాన్ పేరు వినిపించడం ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించడం తో ఆంటీమ్ బైకాట్ చేస్తున్నట్లు సమాచారం.

Share.