మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 5 ముగియబోతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో మానస్, ప్రియాంకపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్రాన్స్ జండర్ అయిన పింకీ పట్ల మొదటి నుండి మానస్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. దాంతో మానస్, పింకీ కి మానసికంగా దగ్గరయ్యాడు. ప్రేమ లాంటి బాండింగ్ ఏర్పడకపోయినా, తనకు ఆమె మంచి స్నేహితురాలు అనే విషయాన్ని మానస్ అంగీకరిస్తాడు. కానీ ఇదే సమయంలో పింకీతో గడిపిన 11 వారాల అనుభవంతో ఆమె క్యారెక్టర్ ను మానస్ బాగానే స్టడీ చేశాడు.
ఈ నేపథ్యంలో నే పింకీ గురించి మాట్లాడుతూ..పింకీ చాలా స్ట్రాంగ్ అని చెబుతూనే, ఆమె విపరీతంగా అబద్ధాలు చెబుతుందనే విషయాన్ని మానస్ బయట పెట్టాడు. ఇంతకాలం ఆటల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పింకీకి సాయం చేస్తూ వచ్చిన మానస్, ఇప్పుడు ఒక్కసారి ఆమె మీద ఇంత తీవ్రమైన ఆరోపణ చేయడం ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ ఈ విషయం పింకీ దృష్టిలోకి వెళితే ఆమె ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవుతుందో ఊహించుకోవచ్చు. అదే జరిగితే, పింకీ – మానస్ మధ్య పెద్ద అగాధం ఏర్పడం ఖాయం. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే ఇదే జరిగే ఆస్కారం కూడా కనిపిస్తోంది.