ఈ మధ్యకాలంలో కరోనా ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది.కర్నాటక రాష్ట్రం ధార్వాడ్‌లోని NDM మెడికల్ కళాశాలలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఈ కళాశాలలో దాదాపుగా 300 మంది విద్యార్థులు, సిబ్బందికి నిన్న కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా 66 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఇవాళ కూడా మరికొందరు విద్యార్థులు, సిబ్బందికి పరీక్షలు చేపట్టారు. దీంతో కరోనా బారినపడ్డ మొత్తం విద్యార్థుల సంఖ్య 182 కి పైగా చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధిత విద్యార్థులందరినీ కళాశాల క్యాంపస్‌లోనే క్వారెంటైన్లో ఉంచినట్లు సమాచారం.
సాధారణంగా ఏ కళాశాలలోనైనా ఫ్రెషర్స్ పార్టీ లు జరగడం అలాగే నవంబర్ 17న కళాశాలలో నిర్వహించిన ప్రెషర్స్ పార్టీ ఇప్పుడు కరోనా విస్తరణకు కారణమైందని ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు. కోవిడ్-19 బారీన పడిన విద్యార్థులు, సిబ్బందిలో సగానికి పైగా రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తయి వారే ఉన్నారని కర్నాటక హెల్త్ కమిషనర్ రణదీప్ వెల్లడించారు.
ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. మరికొందరిలో మాత్రం ఎలాంటి లక్షణాలు లేవని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు కావడంతో కళాశాలలో ఉన్న మొత్తం 3000 మంది విద్యార్థులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపార. ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పరీక్షలు పూర్తయ్యాయని, కొందరి రిపోర్టులు రావాల్సి ఉందని వివరించారు.