కోలీవుడ్ స్టార్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మానాడు. ఈ సినిమాలో ఒకప్పటి దర్శకుడు ఎస్. జే . సూర్య కూడా విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో లూప్ పేరుతో విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎస్.జె.సూర్య మాట్లాడుతూ టాలీవుడ్ లో టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.
తెలుగులో ఎస్.జె.సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఖుషి. ఆతర్వాత కొమరం పులి, మహేష్ బాబుతో కలిసి నాని వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఇక పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ అని, దేవుడు స్వయంగా కూర్చుని తయారుచేసిన సింగిల్ పీస్ అని తెలియజేశాడు ఎస్. జె. సూర్య.మహేష్ తన మనసుకు నచ్చిన పని చేయడానికి కాస్త ఆలోచిస్తాడని , పవన్ కళ్యాణ్ కు మహేష్ కు మధ్య ఉన్న తేడా ఇదే నని తెలియజేశాడు ఎస్. జే. సూర్య.