టాలీవుడ్ లో హీరోయిన్ సమంత ప్రతి ఒక్కరికి కొద్ది రోజుల క్రితమే సమంత విడాకులు తీసుకున్న అనంతరం వరుసప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది. డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనులు లో బిజీగా ఉన్నది సమంత.
సమంత తన డబ్బింగ్ పూర్తి చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్ పోషిస్తున్న సమంత ఈ చిత్రం తనకు కీలకం కానుంది. ఈ చిత్రంతో పాటు గా సమంత నయనతారతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నది.అంతేకాక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించనుంది. ఈవరుస ప్రాజెక్ట్ తో గతంలో కంటే ఎక్కువ బిజీగా సమంత ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సమంత హైదరాబాద్ లో అడుగు పెట్టడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది.