నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఆ శాఖలో భారీగా పోస్టుల భర్తీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సమావేశంలో ఇవాళ వైద్యరంగం అభివృద్ధి విషయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతు. వైద్యరంగంలో అతి పెద్ద మార్పును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి సర్వే ఆంధ్ర ప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు.

ఆరోగ్యశ్రీ అంటే పెద్దవిప్లవం అని స్పష్టం చేశారు. మనిషి ప్రాణానికి విలువ నిచ్చే ప్రభుత్వం ఇది వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాము, మాతో పాటి ప్రజలకు సహకరించే వైద్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు జగన్ ఆరోగ్యశ్రీ వార్షిక పరిమితులు రూ.5 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు రూ. 10 లక్షలు ఖర్చయినా కాని ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామని చెప్పారు సీఎం.

ఇతర రాష్ట్రాల్లోనూ 130 ఆస్పత్రులలో కూడా ఏపీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వైద్య రంగంలో దాదాపు 25 వేల పోస్టులను భర్తీ చేశామని ఫిబ్రవరిలో 14 వేల వరకు పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, ఏరియా ఆస్పత్రులకు ప్రాథమిక హెల్త్ సెంటర్ల రూపు రేఖలు మార్చి ఆపు గ్రేడ్ చేసి నాడు నేడు అనే గొప్ప కార్యక్రమానికి అనుసంధానం చేస్తున్నాం అని చెప్పారు. ఇది నిరుద్యోగులకు చక్కటి అవకాశం అని తెలియజేశారు.

Share.