అల్లు అర్జున్, రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన విడుదల కావలసి ఉంది. అయితే ఇప్పుడు ఆ డేటకి ఈ సినిమా విడుదల అయ్యేలా కనిపించడం లేదు. ఎంతో కష్టపడితే తప్ప అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల చేయడం కష్టమని తెలుస్తోంది. మరొక డేట్ చూసుకోవాల్సిందే అనే మాటలు సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు మరొకసారి భారీ షాక్ తగిలింది.
డైరెక్టర్ సుకుమార్ కు మరొకసారి అస్వస్థతకు గురైనట్లు.. సమాచారం. అందుకోసం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టు గా కూడా తెలుస్తోంది. ఇక ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు కాబట్టే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పడినట్లే ఆన్నట్లు గా సమాచారం.చాలా రోజుల నుంచి సుకుమార్ రెస్ట్ తీసుకోకుండా పని చేస్తున్నారు. దీంతో ఆయన బాగా నీరస పడ్డాడు. అందుచేతనే వైద్యుల అతనిని రెస్ట్ తీసుకోమన్నట్లు గా సమాచారం. సుకుమార్ తను తీయబోయే సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విషయంలో తానే స్వయంగా చూసుకుంటారు. ఇప్పుడిక సుకుమార్ లేకపోవడంతో ఆ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అందుచేతనే ఈ సినిమా డిసెంబర్ 17 విడుదల అవుతుందో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి.