బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షోలో పేరుపొందింది బిగ్ బాస్. వరుసగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ఎప్పుడు ఐదో సీజన్లో బాగానే రాణిస్తోంది. ఈ సీజన్ మొదలై అప్పుడే 11 వారాలు పూర్తి కానుంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు వెళ్లగా.. మొదటివారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదో వారం జశ్వంత్, రీసెంట్గా యానీ మాస్టర్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హౌస్లో 8 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు.
బిగ్ బాస్ హౌస్ లో గెలవాలనే ఆశ పెట్టుకొని యాని మాస్టర్ అడుగుపెట్టగా ఆ ఆశలు ఆవిరైపోయాయి. కానీ ఉన్నన్ని రోజులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే యాని మాస్టర్ ఎలిమినేట్ అయినప్పటికీ.. ఆమె రెమ్యునిరేషన్ మాత్రం బాగా తీసుకున్నట్లుగా సమాచారం. ఈమెకు వారానికి 2 నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈమెకు 11 వారాల కి గాను 30 లక్షల రూపాయలు అందినట్లు సమాచారం.