19 మంది తో గ్రాండ్ గా ఓపెన్ అయిన బిగ్ బాస్ కథ కంచికి చేరుకుంటుంది.ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరందరూ కూడా టాప్ ఫైవ్ లోకి చేరుకోవాలనే పోటాపోటీగా ఆడుతున్నారు. తాజాగా హౌస్ నుంచి అనీ మాస్టర్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఒక ఎప్పటిలాగానే తమలో నుంచి ఒకరిని పంపించేందుకు నామినేషన్ ప్రక్రియ లో పాల్గొన్నారు.ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో సన్నీని గెలిపించడం కోసం సిరి, యానీ ఇద్దరి ఫొటోలు కాల్చేసిన కాజల్‌పై శ్రీరామ్ ఫైర్ అయ్యాడు.అందరూ ఒకరిని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆడితే నువ్వు మాత్రం ఇద్దరిని గేమ్ నుంచి సైడ్ చేయాలని ఆడావు. అది నాకు నచ్చలేదని చెప్తూ కాజల్‌ను నామినేట్ చేశాడు.
దీనికి కాజల్ స్పందిస్తూ.. నా ఫ్రెండ్‌ను సేవ్ చేసి అతడికి పాస్ వచ్చేలా చేయడమే నాక్కావాల్సింది అని తేల్చి చెప్పింది. ఆమె సమాధానం నచ్చని శ్రీరామ్ నీ ఫ్రెండ్ వెళ్లిపోతాడని భయమా? అని ప్రశ్నించగా, ఇంతలో సన్నీ ఎంట్రీ ఇవ్వగా నేను కాజల్ తో మాట్లాడుతున్నాను నీతో కాదు అని అన్నాడు శ్రీరామ్.సిరి, షణ్ను, రవి, నేను ఒక గ్రూప్ అని ఒప్పుకున్నాడు శ్రీరామ్.నేను ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒక గ్రూప్ ఇప్పుడు చెప్పు అని శ్రీరామ్ డైలాగ్ విసరగా ‘ఆ గ్రూపుకు నేను లీడర్‌ను’ అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు సన్నీ. తాజాగా ఈ ప్రోమో రిలీజ్ అయింది.