బంగార్రాజు మూవీ నుండీ మరొక అప్డేట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో నాగార్జున, తన కుమారుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తీయబడుతోంది. ఇక ఈ సినిమా ఫుల్ కామెడీ తో తెరకెక్కించబోతున్నమని ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని తెలియజేశారు. ఈ సినిమాని డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కిస్తున్నాడు.

బంగార్రాజు సినిమాలో రమ్యకృష్ణ కృతి శెట్టి, నటిస్తుండడం విశేషం. నవంబర్ 23 వ తేదీన నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి రెండు సర్ ప్రైజెస్ రాబోతున్నట్లు చిత్రయూనిట్ సభ్యులు ప్రకటించారు. అందుకు సంబంధించి ఈ రోజున ఒక ఫ్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ సినిమాలో ఈ సారి నాగచైతన్య బంగార్రాజు గా కనిపించబోతున్నాడు. నాగచైతన్య ఈ పోస్టర్ లో స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం 10:23 నిమిషాలకు బంగార్రాజు టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్నట్లు సమాచారం.

Share.