కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..ఏమన్నాడంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ నటుడు కైకాల సత్యనారాయణ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఇటీవలే అనారోగ్యం కారణంగా కుటుంబీకులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతను హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే కైకాల సత్యనారాయణ ఆరోగ్యం పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనతో ఫోన్లో మాట్లాడానని, తన మాటలకు కైకాల ఆనందం వ్యక్తం చేశారని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు చిరంజీవి కైకాల ఆరోగ్యంపై ఒక ట్వీట్ చేశారు.

ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహ లోకి వచ్చారని తెలియగానే,క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్లో మాట్లాడాను అని తెలిపారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని పూర్తి నమ్మకం నాకు కలిగింది అని తెలిపారు.

ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా త్వరలోనే మీరు ఇంటికి తిరిగి రావాలి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనే నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థమ్స అప్ చేసి థాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ చెప్పారు అని మెగాస్టార్ తెలిపారు. ఆయన త్వరగా కోలుకొని రావాలి అని ప్రార్థిస్తూ.. ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు అందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అని చిరంజీవి తన ట్వీట్ లిప్ పేర్కొన్నారు.

Share.