సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో సాయి రోనక్, నేహా సోలంకి జంటగా నటించిన తాజా చిత్రం ఉయ్యాలా ప్రేమిద్దాం. ఈ సినిమా ఈ నెల 19 న విడుదల అయి మంచి సక్సెస్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాకు ఉదయ్ కిరణ్ నిర్మాతగా వ్యవహరించారు.ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను చిత్ర బంధం ఏర్పాటు చేశారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా సక్సెస్ మరెన్నో సినిమాలు చేయడానికి నాకు మంచి బూస్టప్ ను ఇచ్చింది అని నిర్మాత తెలిపారు. చిన్న సినిమాను పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అని నిర్మాత ఉదయ్ కిరణ్ తెలిపారు.
అనంతరం దర్శకుడు సురేష్ శేఖర్ రేపల్లె మాట్లాడుతూ..మా సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా పాటలు, నేపథ్య సంగీతం,దర్శకత్వం,కామెడీ,నిర్మాణ విలువలు,సినిమాకు ప్లస్ పాయింట్ అంటున్నారు. ఆడియన్స్తో కలిసి ఫస్ట్ రోజు సినిమా చూశాను. ఐమాక్స్ లో వచ్చే ట్విస్ట్ శశాంక్, నాగినీడు,సిజ్జు పాత్రలు సినిమాకు హైలెట్ అంటున్నారు అని తెలిపారు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని తెలిపారు.