సల్మాన్ ఖాన్ ను కలిసిన రాజమౌళి.. అందుకోసమేనా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, తనయుడు కార్తికేయ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కలుసుకున్నారు. వీరిద్దరూ సల్మాన్ ఖాన్ తో కలిసి కొన్ని గంటలపాటు మాట్లాడారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్,ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వారు ఏ విషయం పై కలుసుకున్నారు అన్న విషయం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. రాజమౌళి తనయుడు కార్తికేయ నవంబర్ 19న ముంబైలోని ఫిలిమ్ సిటీ లో కనిపించారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే రాజమౌళి సల్మాన్ ఖాన్ ను సినిమా కోసం కలిశారా? లేక మరే విషయంపై కలిశారా అనేది తెలియాల్సి ఉంది.

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. రాజమౌళి ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ తో కలిసి ఒక చిత్రం చేయబోతున్నాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share.