ప్రియాంకతో రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన మానస్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ చూస్తుండగానే 11 వారాలు పూర్తి చేసుకుంది. ఇక 12 వ వారంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఇక తాజాగా నాగార్జున సండే అంటే ఫండే మాత్రమే కాదు ఎలిమినేషన్ డే కూడా అని అన్నారు. ఇక ఎప్పటిలాగే ఆదివారం రోజు హౌస్ మేట్స్ తో వినోదాత్మక గేమ్స్ ఆడించారు నాగ్. అలా అందరి నవ్వించి చివర్లో ఎలిమినేట్ చేయడానికి రెడీ అయిపోయారు.తాజాగా ప్రోమో ని బట్టి చూస్తే.. నాగార్జున కంటెస్టెంట్ లతో ఆసక్తికర గేమ్ లు, వినోదాత్మకమైన గేమ్ లు ఆడించినట్లు తెలుస్తోంది.

కంటెస్టెంట్ లు హౌస్ లోని ఇతర ఇంటి సభ్యులను అడగాలి అనుకున్న ప్రశ్నలు పేపర్ మీద రాసి ఇవ్వగా నాగార్జున అడుగుతున్నారు. షణ్ముఖుడు ఫిజికల్ టాక్ అనగానే సన్నీ సైడ్ చూస్తావు తను మరీ అంత వైల్డా? అని ప్రశ్నించగా? షణ్ముక్ ఘల్లుమని నవ్వేశాడు.

అనంతరం మానస్ ప్రియాంకతో నీ ఫ్యూచర్ రిలేషన్ ఏంటి అని ప్రశ్నించగా దానికి తడుముకోకుండా ఫ్రెండ్షిప్ అని బదులిచ్చాడు. ఆ తరువాత మానస్ నుంచి నువ్వు ఏమి ఆశిస్తున్నాము అని ప్రియాంకను అడగగా.. ఈ తిక్క ప్రశ్న ఎవరు అడిగారు అని ఆరా తీసింది. నాగార్జున వెంటనే మానస్ అని చెప్పేసరికి అక్కడున్నవారందరు షాక్ అయ్యారు.

Share.