తాజాగా బిగ్ బాస్ షోలో అనుభవించు రాజా చిత్ర బృందం సందడి చేసింది. బిగ్ బాస్ షో కి హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ కశిశ్ ఖాన్ స్టేజ్ పై సందడి సందడి చేశారు. రాజ్ తరుణ్ ని చూసిన సిరి ఆనందంతో ఎగిరి గంతేసింది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ సిరి నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పడంతో.. వెంటనే సిగ్గు పడిపోగా.. నీ కాదులే అంటూ సిరి పై కౌంటర్ వేసాడు. అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు డ్రాయింగ్ గేమ్ తో కంటెస్టెంట్ లను గుర్తించామని ఒక టాస్క్ ను ఇచ్చారు.
ప్రియాంక సింగ్ వేసిన డ్రాయింగ్ కేవలం ఒక మానస్ కు మాత్రమే అర్థం అయింది. ఆమె గీసిన గీతలు బట్టి అది శ్రీరామ్ డ్రాయింగ్ అని మానస్ సమాధానం ఇవ్వడం తో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక ఆ తరువాత నామినేషన్స్ నుండి అందరూ సేవ్ అయినట్టుగా చూపించారు.
కానీ చివర్లో ప్రియాంక సింగ్,యాని మాస్టర్ ఇద్దరు మాత్రమే మిగిలి పోయినట్టు ప్రోమో లో చూపించారు. వీరిద్దరిలో యాని మాస్టర్ ఎలిమినేట్ అయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.