నందమూరి వారసులపై షాకింగ్ వాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిన్నటి రోజున అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఆయన భార్య భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఈరోజు నందమూరి కుటుంబం తీవ్ర ఆగ్రహం చేస్తోంది. వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తు ఇవాళ నందమూరి కుటుంబం ప్రెస్ మీట్ పెట్టి మరి తప్పుబట్టారు. అయితే ఈ విషయంపై లక్ష్మీపార్వతి మండిపడింది.

బాలకృష్ణ అమాయకుడని, నందమూరి ఫ్యామిలీ చంద్రబాబు ట్రాప్ లో పడుతోందని వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఆరోపిస్తోంది. గతంలో కూడా వైశ్రాయ్ ఘటనలో నాన్న ఎన్టీఆర్ పై చెప్పులు వేయించినప్పుడు వీళ్లంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలుగు వాడు, తెలుగు జాతి అంటే ఎన్టీఆర్ పేరు గుర్తుకు వస్తుందని, మీరంతా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు, ఇప్పుడైనా సక్రమంగా ఆలోచించండి అని కోరారు.

మన కుటుంబానికి నేను ఒకటే చెబుతున్నాను ఎన్టీఆర్ చనిపోయాక చంద్రబాబు ఫోన్ చేసి విదేశాలకు వెళ్లి పోతే ఎంతో కొంత డబ్బు ఇస్తానని చెప్పినట్లుగా లక్ష్మీపార్వతి గుర్తుచేసింది. కావాలంటే చంద్రబాబు కు ఫోన్ చేసి అడగమని కూడా ధైర్యంగా చెప్పింది లక్ష్మీపార్వతి. ఇక అంతే కాకుండా ఎన్టీఆర్ ఎదగడానికి సహకరించకుండా చంద్రబాబు కుట్ర చేశారని లక్ష్మీపార్వతి తెలియజేసింది. ఎన్టీఆర్ చావుకు కూడా చంద్రబాబే కారణమని తెలియజేసింది.

Share.