దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ దృశ్యం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా దృశ్యం టు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో దృశ్యం సినిమా లో వరుణ్ ప్రభాకర్ ను హతమార్చిన వెంకటేష్ కుటుంబం..ఈ సినిమాలో తమ తప్పును ఒప్పుకుంటారా..? లేదా ..? అనేది చూపించబోతున్నారు.
అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ఆరుగురు వ్యక్తులు పై కేసు ఫైల్ చేసినట్లుగా ట్విట్టర్ ద్వారా ఈ ఫోటోలను వెంకటేష్ షేర్ చేయడంతో, ఈ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంకటేష్ కుటుంబంతో పాటు నదియా, ఇన్స్పెక్టర్ లపై కూడా కేసు ఫైల్ చేసినట్లుగా వున్న ఈ ఫోటోలను చూడవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో మిస్టరీ వీడుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.