ఎఫ్-3 సినిమా మరొకసారి వాయిదా పడనుందా .!

Google+ Pinterest LinkedIn Tumblr +

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం f-3 ఈ సినిమాకి డైరెక్టర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మొదట ఆగస్టులో విడుదల అవుతుందని ప్రకటించారు. కానీ ఆ తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందని తెలియజేశారు. మరి ఈ మధ్యనే 2022 లో ఫిబ్రవరి 25వ తేదీన f-3 సినిమాని విడుదల చేయనున్నట్లుగా ఒక పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు.

అయితే తాజాగా ఈ డేట్ కూడా మారేలా ఉందని తెలుస్తోంది. ఇలాంటి ఈ రూమర్స్ రావడానికి ముఖ్య కారణం ఇటీవల వెంకటేష్ చేసిన కామెంట్స్ అని తెలుస్తోంది. దృశ్యం-2 సినిమా ప్రమోషన్ లో భాగంగా వెంకటేష్ F-3 సినిమా పై స్పందించాడు. ఈసారి హాయిగా థియేటర్ లో చూడదగ్గ సినిమా రాబోతుంది అని చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరిలో ఖచ్చితంగా హిట్ కొడతారన్నమాట అని ఒక విలేకరి అడిగితే ఫిబ్రవరిలోనే వస్తామో.. వేసవి సెలవుల్లో వస్తామో ఇప్పుడే చెప్పలేమని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా ఎఫ్-3 సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అంటూ కామెంట్ కూడా చేశాడు వెంకటేష్.

Share.